ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ సీన్ తనకు సవాల్ గా నిలిచిందని, సంతోషాన్ని కూడా ఇచ్చిందన్న మోహన్ బాబు

cinema |  Suryaa Desk  | Published : Sun, Dec 08, 2024, 05:16 PM

ప్రముఖ సీనియర్ నటుడు మోహన్ బాబు సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టు పెట్టారు. 1979లో వచ్చిన 'కోరికలే గుర్రాలైతే' సినిమా గురించి వివరించారు. ఈ సినిమాలో తాను యమధర్మరాజుగా యాక్ట్ చేసిన ఓ సన్నివేశం వీడియో క్లిప్పింగ్ ను పంచుకున్నారు."కోరికలే గుర్రాలైతే... ఈ సినిమాకు నా గురువు, లెజెండరీ డైరెక్టర్ దాసరి నారాయణరావు గారు దర్శకత్వం వహించారు. జి.జగదీశ్ చంద్ర ప్రసాద్ ఈ సినిమాకు నిర్మాత. ముఖ్యంగా, ఈ వీడియోలోని సీన్ నా కెరీర్ లోనే విశిష్ట మైలురాయిగా నిలిచిపోతుంది. చంద్రమోహన్, మురళీమోహన్ లతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎంతో చిరస్మరణీయం.యముడి పాత్రలో మొదటిసారిగా కనిపించడం మర్చిపోలేని అనుభూతినిచ్చింది. ఈ సన్నివేశం నాకు సవాల్ గా నిలిచింది, అదే సమయంలో సంతోషాన్ని కూడా ఇచ్చింది. ఈ సన్నివేశం నా కెరీర్ లోనే ఈ సినిమాను ప్రతిష్ఠాత్మకంగా నిలిచిపోయేలా చేసింది" అని వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com