భారత క్రికెటర్లు.. హీరోయిన్స్‌తో ఎఫైర్లు నడపడం అన్నది ఎప్పటి నుంచో ఉంది. అప్పటి భారత క్రికెట్ కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడి.. షర్మిలా ఠాగూర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు మైదానంలో చూపులు కలిసి తర్వాతే మూడు ముళ్ల బంధంతో ఏడడుగులు వేసారు. ఇప్పటికే టీమ్ ఇండియా క్రికెటర్ జస్ప్రిత్ బుమ్రా..మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్‌తో పీకలోతు ప్రేమలో మునిగిపోయినట్టు సినీ,క్రికెట్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. తాజగా ఈ లిస్ట్‌లో భారత క్రికెట్ ఓపెనర్ కెయల్ రాహుల్, బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టితో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అతియా శెట్టి..ఒకప్పటి బాలీవుడ్ యాక్షన్ హీరో సునీల్ శెట్టి ముద్దుల కూతురు. అంతేకాదు కేఎల్ రాహుల్,అతియా శెట్టి.. ఈ గత రెండు మూడు నెలలుగా డేటింగ్‌లో ఉన్నట్టు బాలీవుడ్ లైఫ్ ఒక కథనంలో పేర్కొంది. అంతేకాదు.. కేఎల్ రాహుల్‌తో అతియా శెట్టి క్లోజ్‌గా దిగిన ఫోటో ఈ గాసిప్స్‌కు మరింత బలాన్ని చేకూర్చాయి. ఈ విషయమై మీడియా కేఎల్ రాహుల్‌ను ప్రశ్నించగా ఆయన సమాధానాన్ని దాటవేసారు. అతియా శెట్టి విషయానికొస్తే.. 2015లో సూరజ్ పాంచోలి హీరోగా తెరకెక్కిన ‘హీరో’ సినిమాతో కథానాయికగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa