'చియాన్' విక్రమ్ సరికొత్త పాత్రలు పోషించేందుకు ఆసక్తి చూపించే విక్రమ్ నటిస్తున్న కొత్త చిత్రం 'వీర ధీర శూరన్: పార్ట్ 2'. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ రిలీజైంది. టీజర్ చూస్తే మాస్ యాక్షన్ ఎంటర్టయినర్ అని అర్థమవుతోంది. ఈ చిత్రానికి ఎస్.యు.అరుణ్ కుమార్ దర్శకుడు. ఇందులో విక్రమ్ కు జోడీగా దుషారా విజయన్ నటిస్తోంది. ఎస్.జె.సూర్య, సూరజ్ వెంజరమూడు తదితరులు కీలకపాత్రల్లో నటించారు. ఏఆర్ రెహమాన్ మేనల్లుడు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఈ 'వీర ధీర శూరన్: పార్ట్ 2' చిత్రం 2025 జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.