టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో క్రేజీ కాంబో సెట్ అయ్యింది. ఆ కాంబో మరేదో కాదు మాస్ కా దాస్ విశ్వక్ సేన్, ఎంటర్టైన్మెంట్ కి కేరాఫ్ అనుదీప్. అవును.. ఈ ఇద్దరి కాంబోలో ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ మూవీ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇవాళ బుధవారం (డిసెంబర్ 12న) ఈ సినిమాకి సంబంధించి టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. 'ఫంకీ' (Funky) అనే క్రేజీ టైటిల్ను ప్రకటించి క్యూరియాసిటీ పెంచేశారు కేవీ. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. "మీ ముందుకు ఫంకీని తీసుకువస్తున్నాము.. నవ్వించే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది.. సంక్రాంతి తర్వాత షూటింగ్ ప్రారంభం!" అంటూ మేకర్స్ తెలిపారు. ఈ సినిమాలో విశ్వక్ సరసన ఆషిక రంగనాధ్ నటించనుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. ఎడిటర్ నవిన్ నూలి. ఈ సినిమా పై హైప్ విపరీతంగా పెరుగుతుంది.