ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆడియో వేడుక‌కు అతిథిగా రానున్న మిథాలీ రాజ్ !

cinema |  Suryaa Desk  | Published : Mon, Jul 01, 2019, 07:02 PM

ఐశ్వర్య రాజేష్ ప్రధానపాత్రలో సీనియర్ దర్శకుడు భీమినేని శ్రీనివాసరాజు తెరకెక్కించిన చిత్రం కౌసల్య కృష్ణమూర్తి. తమిళంలో మంచి విజయం సాధించిన కణ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి ఈ నెల 2న ఆడియో వేడుక జరగనుంది. హైదరాబాద్‌లో జరగబోయే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత మహిళా క్రికెట్ టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్ హాజరుకానున్నారు. ఆమెతో పాటు అందాల తార రాశిఖన్నా కూడా ఈ వేడుకకు మరో అతిథిగా రానున్నారు.
కాగా పల్లెటూరిలో రైతు కష్టాలను, పేదింటి యువతిగా క్రికెటర్ కావాలనుకునే అమ్మాయి కతను ముడిపెడుతూ ఈ చిత్రాన్ని రూపొందించారు. రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ అతిథి పాత్రలో కనిపించనున్నాడు. కేఎస్ రామారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే టీజర్, ఓ పాటతో ఆకట్టుకున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లోనూ మంచి అంచనాలు ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa