గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 'గేమ్ ఛేంజర్' సినిమా సినీ ప్రేమికుల యొక్క అన్ని వర్గాలలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10, 2025న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో అంజలి, నవీన్ చంద్ర, ఎస్‌జె.సూర్య, నాజర్, ప్రకాష్ రాజ్, సముద్రఖని, శ్రీకాంత్, మురళీ శర్మ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించగా థమన్ సంగీత దర్శకుడుగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్‌కి మంచి రెస్పాన్స్ రావడంతో పాటు మొదటి రెండు పాటలకు కూడా మంచి స్పందన వచ్చింది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ట్రైలర్ ని డిసెంబర్ 27న విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. నటుడు రామ్ నందన్ మరియు అప్పన్నగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. థమన్ స్వరపరిచిన పాటలు భారీ చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి మరియు హైప్‌ని పెంచాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.