ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒక స్టార్ హీరోయిన్ కి ప్రదీప్ మొదటి ప్రేమలేఖ..

cinema |  Suryaa Desk  | Published : Sun, Dec 22, 2024, 03:24 PM

బుల్లితెరపై అద్భుతమైన వాక్చాతుర్యంతో, కామెడీతో ఆడియన్స్ ని అలరిస్తూ షోను సక్సెస్ చేస్తూ ముందుకు సాగుతున్న యాంకర్స్ లో ప్రదీప్  ప్రథమ స్థానంలో నిలిచారు. ఫిమేల్ యాంకర్స్ లో సుమా ఎలా అయితే పేరు దక్కించుకుందో.. మేల్ యాంకర్స్ లో ప్రదీప్ కూడా అంతే పేరు సొంతం చేసుకున్నారు. బుల్లితెరపై పలు ఛానల్స్ లో ప్రసారమయ్యే పలు షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూనే మరొకవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  హీరోగా నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమాలో ఒక పాత్రలో నటించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత పలువురు స్టార్ హీరోల సినిమాలలో కమెడియన్ గా చేసిన ఈయన తొలిసారి ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ అనే సినిమాతో హీరోగా మారి సక్సెస్ అందుకున్నారు. స్టార్ హీరోయిన్ కి ప్రదీప్ ప్రేమలేఖ.. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు ప్రదీప్. ఈ సినిమాలో హీరోయిన్గా ప్రముఖ యాంకర్ దీపిక పిల్లి నటిస్తోంది. ఈ క్రమంలోనే ప్రదీప్ కి సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ప్రదీప్ తన మొదటి ప్రేమలేఖను ఒక స్టార్ హీరోయిన్ కి ఇచ్చాడని, అయితే ఆ స్టార్ హీరోయిన్ కూడా క్రేజీగా సమాధానం చెప్పిందని సమాచారం. అసలు విషయంలోకి వెళ్తే.. గతంలో ప్రదీప్ ‘కొంచెం టచ్ లో ఉంటే చెబుతా’ కార్యక్రమాన్ని నిర్వహించేవారు. ఈ కార్యక్రమానికి పలువురు స్టార్ సెలబ్రిటీలు వచ్చి సందడి చేసేవారు. ఈ నేపథ్యంలోనే అనుపమ కూడా ఒకరోజు షో కి రాగా..ఆమెకు తన ప్రేమ లేఖను అందించారు ప్రదీప్. అందంతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అనుపమ..అంద చందాలతో నటనతో యువతను ఉక్కిరిబిక్కిరి చేసిన ఈ అమ్మడు,ఈ మధ్య కాలంలో హద్దులు దాటి మరీ నటిస్తోంది అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే అబ్బాయిల కలల రాకుమారిగా మారిన ఈమె నటి మాత్రమే కాదు మల్టీ టాలెంటెడ్ కూడా. ఒకప్పుడు పద్ధతికి పెద్దపీట వేసిన అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు గ్లామర్ గేట్లు ఎత్తేసి ట్రెండ్ ని ఫాలో అవుతోంది. ఇక ఆమధ్య ప్రదీప్ యాంకర్ గా చేస్తున్న కొంచెం టచ్ లో ఉంటే చెబుతా షో కి వెళ్లిన ఈమె, అందులో తన స్కూల్ డేస్ మెమోరీస్ ని పంచుకుంది. అనుపమ పరమేశ్వరన్ కు ప్రేమలేఖ ఇచ్చిన ప్రదీప్.. అనుపమా మాట్లాడుతూ..” ఒకటి రెండు లవ్ లెటర్స్ మినహా ఎవరు నాకు పెద్దగా లవ్ లెటర్లు రాయలేదు. అయితే అవి సీరియస్గా రాసేవారు కాదు. అదే బాధగా ఉండేది. అయితే చాలామంది నా వెంటపడేవారు కానీ నేను కోప్పడడంతో వెళ్లిపోయేవారు” అంటూ తెలిపింది అనుపమ. ఇక దీనిని విన్న ప్రదీప్ అవకాశంగా తీసుకున్నాడు. అనుపమ పరమేశ్వరన్ కి పొయెటిక్ గా, రొమాంటిక్ గా లవ్ లెటర్ కూడా రాశాడు. తనమీద గులాబీ పూల రేకులు చల్లుతూ లవ్ లెటర్ ఇచ్చాడు. కానీ అది తెలుగులో ఉండడంతో ఆమెకు అర్థం కాలేదు. దానితో ప్రదీప్ స్వయంగా చదివి వినిపించాడు… “ప్రియమైన అను.. ప్రేమతో నీ ప్రదీప్. మీ నడక, చూపు అద్భుతం , మీరే అద్భుతం, ఒక్క అవకాశం ఇస్తే గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను”అంటూ లవ్ ప్రపోజ్ చేశాడు. దీంతో అనుపమ కూడా థాంక్యూ సో మచ్, మోస్ట్ వండర్ఫుల్ లవ్ లెటర్ అంటూ కామెంట్లు చేసింది. దీంతో ప్రదీప్ ఫుల్ ఖుషీ అయిపోయి థాంక్యూ చెప్పాడు. అంతే కాదు తాను రాసిన మొదటి ప్రేమలేఖ అని, అందులోను ఒక స్టార్ హీరోయిన్ కి అని చెప్పి సంబరపడిపోయారు ప్రదీప్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com