యూట్యూబర్ షన్ముఖ్ జస్వంత్ గురించి చెప్పక్కర్లేదు. షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ ద్వారా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సాఫ్ట్ వేర్ డెవలపర్, సూర్య వెబ్ సిరీస్ ద్వారా స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు.షన్ను నటించిన ఈ రెండు సిరీస్ సూపర్ హిట్స్ కావడంతో షన్నూ పేరు మారుమోగింది. దీంతో బిగ్ బాస్ కు ఛాన్స్ కూడా కొట్టేశాడు. ఈ షో నుంచి బయటకు వచ్చాకా..దీప్తి సునయనతో బ్రేకప్, ఆ తర్వాత యాక్సిడెంట్, గంజాయి ఇలా అనే వివాదాల్లో చిక్కుకున్నాడు. దీంతో ఎలాంటి కంటెంట్ లేకుండా సైలెంట్ అయ్యాడు. చాలా కాలం గ్యాప్ తీసుకున్న షన్నూ ఇప్పుడు లీలా వినోదం అనే తో ఓటీటీ అడియన్స్ ముందుకు వచ్చాడు. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ పామ్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది.ఈ ప్రమోషనల్లో జరిగిన ఓ ఈవెంట్లో షన్నూ మాట్లాడుతూ తన లైఫ్ లో జరిగిన సంఘటనలను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలోనూ మరోసారి ఎమోషనల్ అయ్యాడు. తన జీవితంలో ఎదురైన సంఘటనలతో రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్ చేసినట్లు చెప్పుకొచ్చాడు.
షన్నూ మాట్లాడుతూ.. “బెంగళూరులో అమృత యూనివర్సిటీలో చదువుకున్నాను. కానీ అప్పటి నుంచే యాక్టింగ్ అంటే పిచ్చి. దీంతో లెఫ్ట్ బ్రెయిన్ కొంచం హెవీ అయ్యిందని..చదవలేకపోతున్నానని ఇంట్లో చెప్పాను. దీంతో వాళ్లు నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ డాక్టర్ తో యాక్టింగ్ అంటే ఇష్టం అని.. అందుకే ఇలా చెప్పాను అని చెప్పడంతో అతడు నాకు ప్రెజర్ ఎక్కువగా ఉందని తీసుకెళ్లాలని చెప్పాడు. అదే సమయంలో ఫస్ట్ లవ్ బ్రేకప్, యాక్టింగ్ ఛాన్సులు రాకపోవడంతో డిప్రెస్ అయి సూసైడ్ అటెంప్ట్ చేశాను” అని అన్నాడు.
“నేను ఏం చేసానో.. మీరు ఏం విన్నారో అదేం నిజం కాదు. అయ్యింది ఒక కథ అయితే మీకు మరో కథ చూపించారు. నేను తప్పు చేయలేదు అని చెప్పట్లేదు. కానీ నేను ఒక్కడినే తప్పు చేశాను అన్నట్లుగా చూపించారు. ఒకదాని తర్వాత ఒకటి రావడంతో.. నా చుట్టూ ఉన్నవాళ్లే నన్ను వదిలేయడంతో నేను డిప్రెషన్ లోకి వెళ్లాను. అప్పుడు చెయి కోసుకోని సూసైడ్ అటెంప్ట్ చేశాను. నా ఫ్యామిలీ చాలా ఎఫెక్ట్ అయ్యారు. నేను హనుమాన్ మీద ఒట్టేశాను. నా ఫ్యామిలీని పైకి తీసుకోచ్చేది నేనే” అంటూ మరోసారి ఎమోషనల్ అయ్యాడు షన్ను.