ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుర్రాకారు మతి పోగొడుతున్నా లక్ష్మీరాయ్

cinema |  Suryaa Desk  | Published : Sat, Jul 06, 2019, 09:50 AM

సోషల్ మీడియాను తమ అందాలతో వేడెక్కించడంలో నేటి హీరోయిన్స్ నేనంటే నేను అంటూ ముందుకొస్తున్నారు. బికినీ వేసి అందమైన ఫోజులిస్తూ కుర్రాకారు మతి పోగొడుతున్నారు. ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి సామజిక మాధ్యమాల ద్వారా తమను తాము ప్రమోట్ చేసుకుంటూ అవకాశాలు కొట్టేస్తున్నారు అందాల తారలు. ప్రస్తుతం ఇలా చేస్తున్న హీరోయిన్స్ లిస్ట్ చాలా పెద్దది. అయితే అందులో కొందరు మాత్రం చాలా చాలా ప్రత్యేకం.


అవకాశాలతో సంబంధం లేకుండా కేవలం హీటు పుట్టించడమే లక్ష్యంగా అందాల ఆరబోతతో కనువిందు చేయడం వీరి స్టైల్. సరిగ్గా అదే కోవకు చెందుతుంది హాట్ బ్యూటీ లక్ష్మీరాయ్.రాయ్ లక్ష్మి అంటూ స్టైలిష్ గా పిలిపించుకునే ఈ భామకు సోషల్ మీడియా సోకులు చాలా ఎక్కువ. ఎప్పుడూ ఏదో ఒక సెక్సీ పిక్‌తో నెటిజన్ల మనసు దోచుకుంటూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా హాఫ్ బికినీలో అదిరిపోయే క్లిక్‌కి ఫోజిచ్చింది రాయ్ లక్ష్మి. నేటితరం కుర్రకారు కోరుకునే విధంగా స్టైలిష్ లుక్, బికినీ అందాలు రెండింటినీ మిక్స్ చేసి ఆకర్షించింది.


ఐరోపా దేశంలోని బీచ్‌లో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూ ఈ పిక్ దిగింది రాయ్ లక్ష్మి. పైగా దీన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ 'మాల్టా డైరీస్' అనే కాప్షన్ ఇచ్చింది. హాఫ్ బికినీలో రత్తాలు పోస్ట్ చేసిన ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇక రాయ్ లక్ష్మి సినిమాల సంగతి అంటారా..! ఇటీవలే 'వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి' అనే హారర్ కామెడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ భామ అంతగా సక్సెస్ కాలేక పోయింది. అయినప్పటికీ సౌత్ ఇండియన్ భాషల్లో ఆమె జోరు కొనసాగుతూనే ఉంది. రాయ్ లక్ష్మి ప్రస్తుతం యోధా 2, రాణి రాణమ్మ అనే రెండు తెలుగు సినిమాల్లో, శృంగార అనే కన్నడ సినిమాలో నటిస్తోంది.


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa