ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్లి కాలేదు కాని…మూడేళ్ల కూతురుంది

cinema |  Suryaa Desk  | Published : Sat, Jul 06, 2019, 11:04 AM

తనకింకా పెళ్లి కాలేదు. కానీ మూడేళ్ళ కూతురు ఉంది అని అంటోంది నటి మహీ గిల్‌ (45). బాలీవుడ్‌ నటి చేసిన ఈ ప్రకటన సంచలనం సృష్టించింది. సోషల్‌ మీడియాలో రకరకాల కామెంట్స్‌తో ట్రెండింగ్‌ అవుతోంది. పంజాబ్‌కు చెందిన మహీ గిల్‌ 2003లో బాలీవుడ్‌లో తన కెరీర్‌ ప్రారంభించింది. హిందీ, పంజాబీ చిత్రాల్లో నటించింది. ‘దబాంగ్‌’, దబాంగ్‌ 2, 3తో పాటుగా ‘మిర్చ్‌’, ‘జంజీర్‌’, ‘దేవ్‌ డీ’, ‘షాహిబ్‌ బీవీ ఔర్‌ గ్యాంగ్‌స్టర్‌’ తదితర చిత్రాల్లో నటించింది. ఇటీవల ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ తనకు ఇప్పటికే మూడేళ్ల కూతురుందని తెలిపింది. తనకు ఇంకా పెళ్లి కాలేదని, ఆ అవసరం కూడా ఉందని భావించడం లేదని స్పష్టం చేసింది. తనకు కూతురు ఉందనే విషయాన్ని ఇప్పటి వరకు వెళ్లడించకపోవడానికి ప్రత్యేక కారణం అంటూ లేదని, ఎవరూ అడగకపోవడం వల్లే చెప్పలేదని మహీ తెలిపింది. ఒక బిడ్డకు తల్లిగా ఉండడం గర్వంగాఉంది. ఇక పెళ్లి చేసుకోవడం అనేది నా పర్సనల్‌ ఛాయిస్‌. చేసుకోవాలని అనిపిస్తే చేసుకుంటాను. పెళ్లి అనేది మన ఆలోచనా ధోరణిపై ఆధారపడి ఉంటుంది. పెళ్లి చేసుకోకుండా పిల్లలను కనడంలో ఇబ్బంది లేదని చెబుతూ పెళ్లి లేకపోయినా పిల్లల్ని కుటుంబాన్ని కలిగి ఉండవచ్చని అభిప్రాయపడింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa