ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సామాజిక సేవ చేస్తున్నమల్లికా షెరావత్

cinema |  Suryaa Desk  | Published : Wed, Jul 10, 2019, 11:09 AM

బాలీవుడ్ శృంగార తార మల్లికా షెరావత్ తెలియనివారుండరు. ప్రస్తుతం ఈ అమ్మడుకి సినిమా అవకాశాలు తగ్గడంతో కొంచెం యూత్ లో క్రేజ్ తగ్గింది కానీ,ఒక పదేళ్ల క్రితం హిస్, మర్డర్, కిస్ కిస్ కి కిస్మత్, క్వాహిష్ వంటి పలు చిత్రాలలో హాట్ సీన్స్ లో నటించి కుర్రకారుకు నిద్ర లేకుండా చేసింది. ది మిత్, పాలిటిక్స్ అఫ్ లవ్ వంటి హాలీవుడ్ సినిమాలలో కూడా మల్లికా షెరావత్ నటించారు.


తాజాగా హాట్ బ్యూటీ ఓ సామజిక అవగాహన ప్రచారకార్యక్రమంలో పాల్గొంటూ వార్తలలో నిలిచారు. రోటరీ ఇంటర్నేషనల్ ఆధ్వరంలో నిర్వహిస్తున్న పోలియో అవగాహన కార్యక్రమ ప్రచార కర్తగా మల్లికా వ్యవహరిస్తున్నారు.’ పోలియోని అంతం చేయడానికి మనం ఇంత దగ్గరగా ఉన్నాం’ అంటూ ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. ఏమైనా మల్లిక నెరవేరుస్తున్న సామజిక బాధ్యత చూస్తుంటే మెచ్చుకోకుండా ఉండలేం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa