ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బన్నీ సరసన హీరోయిన్ గా రాశి ఖన్నా ..

cinema |  Suryaa Desk  | Published : Wed, Jul 10, 2019, 11:13 AM

రాశి ఖన్నా టైం ఇప్పుడే మొదలైనట్లుంది, తెలుగు,తమిళ భాషలలో వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. తమిళంలో ఇటీవలే విశాల్ హీరోగా విడుదలైన “అయోగ్య”మూవీతో హిట్ అందుకున్న ఈ భామ విజయ్ సేతుపతితో మరో సినిమాలో నటిస్తుంది. అలాగే తలపతి విజయ్ 64వ చిత్రంగా తెరకెక్కనున్న చిత్రంలో కూడా రాశి ఖన్నా ఒక హీరోయిన్ గా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక తెలుగులో ధరమ్ తేజ్ హీరోగా మారుతి దర్శకత్వంలో మొదలైన “ప్రతిరోజూ పండుగే”,బాబీ దర్శకత్వంలో “వెంకీ మామ” చిత్రాల షూటింగ్ జరుగుతుంది.


వీటితో పాటు రాశి ఖన్నా మరో బంపర్ ఆఫర్ పట్టేసిందని తెలుస్తుంది.ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటిస్తున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తరువాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారు. ఈ చిత్రంలో బన్నీ సరసన హీరోయిన్ గా రాశి ఖన్నా పేరును పరిశీలిస్తున్నారట. “ఐకాన్” అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో స్క్రిప్ట్ ప్రకారం రాశి ఖన్నా ఐతే బాగుంటుందని దర్శకుడు భావిస్తున్నారట. ఈ ప్రాజెక్ట్ కనుక ఓకే అయితే రాశి దశతిరిగినట్లే. దిల్ రాజు నిర్మాణంలో రాబోతున్న “ఐకాన్” సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల కానుంది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa