దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలని సామెత సినీ ఇండస్ట్రీలోని వారంతా చక్కగా పాటిస్తారు. ఓ హిట్టు పడగానే పారితోషికం భారీగా పెంచేసే నటుల జాబితాలోకి బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ కూడా చేరిపోయాడిప్పుడు. తెలుగులో భారీ విజయం సాధించిన అర్జున్ రెడ్డిని హిందీలో కబీర్ సింగ్‌గా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. షాహిద్ కపూర్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కబీర్ సింగ్ నిలిచింది. ఈ సినిమా విజయంతో షాహిద్ కపూర్ తన పారితోషికాన్ని ఏకంగా రూ. 35 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లువార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ వార్తలే నిజమైతే బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల సరసన షాహిద్ కూడా చేరతాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa