ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ‌దిలో నాయిక మారింది…

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 11, 2019, 11:11 AM

డిమాండ్‌ అండ్‌ సప్లయి అనే సూత్రం ప్రకారమే చిత్ర పరిశ్రమలో జరుగుతుంది. ఒక సినిమాలో స్టార్స్‌ నటించడమంటే మామూలు విషయం కాదు. వారితో అన్నీ వివరంగా మాట్లాడుకోవాలి. ఆ తర్వాత ఒప్పంద చేసుకోవాలి. దీనికంటే ముందు వారికి మనం చెప్పే కథ నచ్చాలి. వీటిని ఫాలో అవుతూనే రాజుగారి గది 3 సినిమాకు శ్రీకారం చుట్టాడు చిత్ర దర్శకుడు. ప్రారంభోత్సవానికి హీరోయిన్‌ తమన్నా సైతం హాజరైంది. ఈ సినిమాలో నటిస్తున్నందుకు ఆనందంగా ఉందని సెలవిచ్చింది. ఇంతవరుకు బాగానే ఉంది. ఆ తర్వాత తమన్నా తప్పుకుందనే మార్త బయటకు వచ్చింది. కథ నచ్చలేదని, అందుకే నటించడం లేదని చిత్ర సంబంధికులు లీకులిచ్చారు. కానీ పారితోషికం విషయంలో తేడా వచ్చి తప్పుకుందనే మాట వినిపించింది. తమన్నా బదులు తాప్సీ, కాజల్‌ పేర్లు పరిశీలించారు. వీరు కూడా వెంటనే డేట్స్‌ ఇవ్వడం కష్టమని తేల్చేశారు. తాజాగా అవికా గోర్‌ పేరు వినిపిస్తోంది. ఉయ్యాల జంపాలా, సినిమా చూపిస్తా మావ చిత్రాల్లో నటించిన అవికా ఈ సినిమాలో నటించేందుకు సూత్రపాయంగా అంగీకరించినట్టు సమాచారం. ఏది ఏమైనా అధికారికంగా ప్రకటనరావాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa