అక్కినేని హీరో నాగచైతన్య ఇటీవల శోభిత దూళిపాళ ను రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఆయన సినిమాల విషయానికొస్తే.. చందూ మొండేటి(Chandoo Mondeti) దర్శకత్వంలో చైతు ‘తండేల్’(Thandel) మూవీ చేస్తున్నాడు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుండగా.. అల్లు అరవింద్(Allu Aravind) సమర్పణలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు(Bunny Vasu) నిర్మిస్తున్నారు. దీనికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.అయితే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ విశాఖపట్నం, శ్రీకాకుళంలో జరిగింది. అయితే ఈ సినిమా ఫిబ్రవరి 14న థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఈ క్రమంలో.. తండేల్ మూవీ మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసి వరుస అప్డేట్స్ ఇస్తూ అంచనాలను పెంచుతున్నారు. తాజాగా, చిత్రబృందం యూట్యూబ్ ద్వారా ఓ స్పెషల్ వీడియోను షేర్ చేశారు. తండేల్ రాజు చేపల పులుసు చేసి టీమ్ అందరికీ వడ్డించడంతో పాటు వారితో కలిసి తిన్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.