ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గాంధీ తాత చెట్టు మూవీ రివ్యూ....

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 27, 2025, 11:53 AM

సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన చిన్న చిత్రం 'గాంధీ తాత చెట్టు'. దర్శకుడు సుకుమార్ తనయ సుకృతివేణి ఇందులో ప్రధాన పాత్రధారి కావడంతో సినిమాకి కావాల్సినంత ప్రచారం వచ్చి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ఎలాంటి సందేశాన్ని ఇచ్చింది? జనాలకు నచ్చి,మెచ్చుకునే సినిమానేనా, గాంధీ సిద్దాంతాలను ఈ సినిమా ఏ మేరకు ముందుకు తీసుకువెళ్లింది వంటి విషయాలను రివ్యూలో చూద్దాం.


స్టోరీ లైన్


            అహింస ఆయుధంగా చేసుకొని బ్రిటీషర్లను దేశం నుంచి తరిమికొట్టారు మహాత్మా గాంధీ. ఆయన బాటలోనే కార్పొరేట్ శక్తుల బారి నుంచి తమ ఊరిని ఓ అమ్మాయి ఎలా కాపాడిందనే పాయింట్‌ తో ఈ సినిమా ముందుకు వెళ్తుంది. ఈ రోజుల్లోనూ గాంధీ సిద్దాలను నమ్మి ముందుకు వెళ్లే గాంధేయవాది రామచంద్రయ్య (ఆనంద చక్రపాణి). ఆయన అంటే ఆ ఊరిలో అందరికీ ఇష్టం. ఆయన మనుష్యులతో పాటు చెట్టు,పుట్టలను కూడా అంతే సమానంగా, ప్రేమగా చూడగలరు. రామచంద్రయ్య తనకున్న పదెకరాల పొలంలో ఓ వేపచెట్టు నాటుతాడు. ఆ చెట్టుపై అభిమానాన్నిపెంచుకుంటాడు. అంతేకాదు గాంధీజీపై ఉన్న అభిమానంతో తన మనవరాలికి గాంధీ (సుకృతి వేణి) అనే పేరు పెడతాడు. ఆ పాపకు తూా గాంధీకి తాత అంటే ఎంతో ఇష్టం. తన తాత పాటించే గాంధీ భావాలను, విలువలను తను కూడా గౌరవించి పాటిస్తుంది. తోటి స్నేహితులను కూడా అదే దారిలో నడిచేలా ప్రేరణ ఇస్తూంటుంది. ఇక షుగర్ ఫ్యాక్టరీ పెడుతున్నామని చెప్పి ఊళ్లోని భూములను ఓ కార్పొరేట్ కంపెనీ ప్రతినిధి సురేష్ (రాగ్ మయూర్‌) కొనడానికి వస్తాడు. రామచంద్రయ్య భూమిపై కన్నేస్తాడు. కానీ ఆ కంపెనీ వారికి తన భూమిని అమ్మడానికి రామచంద్రయ్య ఒప్పుకోడు. ఈ క్రమంలో కన్న కొడుకుతో పాటు ఊరివాళ్లకు రామచంద్రయ్య శత్రువుగా మారిపోతాడు. ఆ తర్వాత ఏమైంది? ఇలా ప్రశాంతంగా ఆ ఊరు ఉన్న సమయంలో అక్కడికి కెమికల్‌ ఫ్యాక్టరీ స్థాపన కోసం సతీష్‌ (రాగ్‌ మయూర్‌) వస్తాడు. ఆ ఊరిలో అందరి పొలాలను తమ ఫ్యాకర్టీ కోసం అమ్మాలని అడుగుతాడు. అసలే వ్యవసాయం లాభసాటిగా లేదు అనుకుంటూంటే...మరో ప్రక్క ఊరిలో పండించిన చెరకు పంటను కూడా తీసుకోవడానికి షుగర్‌ ఫ్యాకర్టీ వాళ్లు కూడా నిరాకరిస్తారు. దాంతో ఇంక పూర్తిగా వ్యవసాయం చేయడం లాభం లేదని, గ్రామస్తులందరూ సతీష్‌కు పొలాలను అమ్మేస్తారు. బ్రతుకు తెరువుకు వేరే చోటకు వెళ్లిపోదామనుకుంటారు. కానీ రామంచంద్రయ్యకు మాత్రం అది ఇష్టం ఉండదు. తన పొలాన్ని ఇవ్వడానికి ఒప్పుకోడు. కానీ సతీష్ ఒప్పుకోడు. నయానో, భయాన్నో ఆ పొలాన్ని లాగేయాలనుకుంటాడు. పనిలో పనిగా ఆ చెట్టు అంతం చూడాలనుకుంటాడు. అప్పుడు జరిగిందేమిటి? ఈ క్రమంలో రామచంద్రయ్య కుటుంబంలో చోటు చేసుకున్న సంఘటనలు ఏమిటి? తాత అడుగుజాడల్లో మనవరాలు గాంధీ ఎలా నడిచింది, ఉద్యమం చేసింది, చివరకు తన చెట్టుని , తన ఊరుని ఎలా కెమికల్ ఫ్యాక్టరీ కబంధ హస్తాల నుంచి ఎలా తప్పించింది? అనేది మిగతా కథ.


విశ్లేషణ


           సోషల్ ఇష్యూలను కథా వస్తువులుగా తీసుకొని సినిమాలు చేసే ట్రెండ్ ఇప్పుడు తెలుగులో దాదాపు తగ్గిపోయింది. మాస్‌, యాక్షన్, కామెడీలతో కూడిన కమర్షియల్ మూవీస్ కు ఆదరణ పెరిగిపోయింది. దాంతో మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాల ఒరవడి తెలుగులో చాలా తగ్గుముఖం పట్టింది. ఆ లోటును కొంత వరకు భర్తీ చేస్తుంది గాంధీ తాత చెట్టు. రెగ్యులర్‌ కమర్షియల్‌ చిత్రంగా చూస్తే అసలు నచ్చదు. కానీ ఓ విభిన్నమైన ప్రయత్నంగా, గాంధీ మహాత్ముడు విలువలను, వచనాలను ఈ కాలానికి చెప్పాలని ప్రయత్నించిన చిత్రంగా చూస్తే హృదయానికి హత్తుకోవాలనిపిస్తుంది. ముఖ్యంగా ఈ కేజీఎఫ్ రోజుల్లో హింస లేనిదే సినిమా తీయలేము అనుకుంటున్న సమయంలో ఓ పల్లెటూరి వాతావరణంలో ఎటువంటి రక్తపాతం, హింస లేకుండా స్టోరీని నేరేట్ చేయటం ఓ పెద్ద విజయం అని చెప్పాలి. ఈ చిత్రం దర్శకురాలు పద్మావతి మల్లాది తొలి చిత్రాన్ని కమర్షియల్ గా మలచాలనుకోకుండా, ఓ సందేశాత్మకమైన చిత్రంగా ఆలోచింపజేసే కథతో రావటం ఆనందపరిచే విషయం. ముఖ్యంగా గాంధీ పాత్రను, ఆ పాత్రను డిజైన్‌ చేసిన విధానం, కథలో ఎమోషన్‌ పండించిన విధానం బాగున్నాయి. చిత్రంలోని ప్రతి పాత్ర ఎంతో సహజంగా మలిచారు. రామచంద్రయ్య పెంచుకున్న చెట్టును కాపాడటం కోసం గాంధీ ఏం చేసింది అన్నది సెకండాఫ్‌లో హృద్యంగా దర్శకురాలు ఆవిష్కరించారు. అయితే ఫస్టాఫ్ లో అక్కడక్కడా కాస్త స్లో అనిపిస్తుంది. సెకండాఫ్ లో కథ కాంఫ్లిక్ట్ లోకి ప్రవేశించాక ఎమోషన్స్ అందరి హృదయాలను హత్తుకుంటుంది. మనం పీల్చే గాలి విలువ, చెట్ల పెంపకం ఇలాంటి అంశాలను వివరించటంలో సఫలీకృతులయ్యారు. అయితే అక్కడక్కడా తగిలే సినిమాటిక్‌ గా అంశాలు మాత్రం పంటిక్రింద రాళ్లలా అనిపిస్తాయి. అలాగే కెమికల్ ఫ్యాక్టరీ ఊరికి రావటం , పొలాలు అమ్మేయటం వంటి విషయాలు కొత్తగా అనిపించవు, రొటీన్ కమర్షియల్ ఎలిమెంట్స్ గా అనిపిస్తాయి.


సినిమాలో తాత-మనవరాళ్ల మధ్య వచ్చే సన్నివేశాలు కంటతడి పెట్టిస్తాయి. ముఖ్యంగా గాంధీ (సుకృతి వేణి) గుండు కొట్టించుకునే సీన్‌తో పాటు పతాక సన్నివేశాలు అందరి హృదయాలను బరువెక్కిస్తాయి. రామచంద్రయ్యగా చక్రపాణి ఆ పాత్రలో జీవించాడు. సతీష్‌ పాత్రలో రాగ్‌ మయూర్‌ నటన చాలా బాగుంది. మరీ ముఖ్యంగా గాంధీ పాత్రలో సుకృతి వేణి నటన ఈ చిత్రానికి ప్రధాన బలం. అసలు ఆమెది మొదటి సినిమా అంటే నమ్మబుద్ది కాదు పెద్దలతో పాటు పిల్లలకు చూడాల్సిన సినిమా. చిన్న వయస్సులోనే ఇలాంటి సినిమాలు చూపించటం ద్వారా గాంధీని, ఆయన అహింసాయుత సిద్దాంతాలను ఈ తరానికి పరిచయం చేసినట్లు అవుతుంది. మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్‌ను ఇష్టపడే ఆడియెన్స్‌ను మెప్పిస్తుంది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com