ఇండిగో విమానయాన సంస్థ తీరుపై నటి మంచు లక్ష్మి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ సంస్థకు చెందిన విమానంలో తాను ప్రయాణించగా.. ఇబ్బందులు ఎదుర్కొన్నానని పేర్కొన్నారు. సిబ్బంది ఎంతో దురుసుగా ప్రవర్తించారని పేర్కొంటూ ఎక్స్ వేదికగా ఆ సంస్థను ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టారు.‘‘నా లగేజ్ బ్యాగ్‌ను పక్కకు తోసేశారు. బ్యాగ్ ఓపెన్ చేయడానికి కూడా అనుమతించలేదు. వాళ్లు చెప్పినవిధంగా చేయకపోతే గోవాలోనే నా సామాను వదిలేస్తామని అన్నారు. సిబ్బంది దురుసుగా వ్యవహరించారు. ఇదొక రకమైన వేధింపు. నా కళ్లెదుట సెక్యూరిటీ ట్యాగ్ కూడా వేయలేదు. ఒకవేళ ఏదైనా వస్తువు మిస్ అయితే సంస్థ బాధ్యత తీసుకుంటుందా? ఈవిధంగా ఎయిర్‌లైన్స్‌ను ఎలా నడపగలుగుతున్నారు’’ అని ఆమె పేర్కొన్నారు. ఇకపై తాను ఈ ఎయిర్‌లైన్స్‌కు దూరంగా ఉంటానని వెల్లడించారు. తనతోపాటు మరికొంతమంది ప్రయాణికులు కూడా ఇబ్బందులు