కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతారకు మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. నయనతార స్వీయ డాక్యుమెంటరీ విషయంలో ధనుష్ వేసిన కాపీరైట్ దావాను కొట్టివేయాలంటూ నెట్‌ఫ్లిక్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్ న్యాయస్థానం తిరస్కరించింది. నటుడి అనుమతి లేకుండా అతడి సినిమా క్లిప్స్ వాడుకోవడాన్ని తప్పుపట్టింది. మరోవైపు బయోపిక్‌పై మధ్యంతర నిషేధం విధించాలన్న ధనుష్ సంస్థ వేసిన పిటిషన్‌పై ఫిబ్రవరి 5న విచారణ చేపడతామని కోర్టు పేర్కొంది.