దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆర్జీవీ ను అసభ్యకర పోస్టుల కేసు వెంటాడుతోంది. ఈ వ్యవహారంలో ప్రకాశం జిల్లా ఒంగోలు రూరల్ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరి 4న విచారణకు రావాలని ఆర్జీవీకి వాట్సప్ ద్వారా ఇచ్చిన నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. 4న సినిమా షూటింగ్‌ల నిమిత్తం బిజీగా ఉంటానని.. విచారణకు రాలేనని ఆయన సమాధానమిచ్చారు. 7వ తేదీన విచారణకు వచ్చే అవకాశాన్ని పరిశీలిస్తానని రాంగోపాల్‌వర్మ చెప్పినట్లు సమాచారం. గతంలో రెండుసార్లు ఆర్జీవీకి పోలీసులు నోటీసులు ఇచ్చినప్పటికీ విచారణకు హాజరుకాలేదు. అనంతరం హైకోర్టును ఆశ్రయించడంతో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరైంది. దర్యాప్తునకు సహకరించాలని, పోలీసులు కోరినప్పుడు విచారణకు అందుబాటులో ఉండాలని వర్మకు ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు.సార్వత్రిక ఎన్నికలకు ముందు ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్ సమయంలో తెదేపా అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా సోషల్ మీడియా వేదికగా రాంగోపాల్ వర్మ అసభ్యకర పోస్టులు పెట్టారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు మండల తెదేపా ప్రధాన కార్యదర్శి రామలింగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా పోలీసులు వర్మపై కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa