ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలో విడుదల కానున్న 'రెట్రో' సెకండ్ సింగల్

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 21, 2025, 06:14 PM

తమిళ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం 'రెట్రో' అనే పీరియడ్ డ్రామాలో పని చేస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెడ్జ్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఇటీవలే చిత్ర బృందం ఆడియో ఆల్బమ్ నుండి మొదటి సింగిల్‌ను కన్నడి పూవ్ పేరుతో విడుదల చేయగా, ఈ సాంగ్ కి భారీ రెస్పాన్స్ లభించింది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి సెకండ్ సింగల్ ని త్వరలో విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. రానున్న రోజులలో మేకర్స్ అధికారకంగా ప్రకటన చేయనున్నారు. రెట్రోలో జోజు జార్జ్, జయరామ్, నాసర్, ప్రకాష్ రాజ్, కరుణకరన్, విద్యా శంకర్ ప్రముఖ పాత్రలలో ఉన్నారు. ఈ సినిమాలో నటి శ్రియా శరణ్ ప్రత్యేక పాటలో కనిపించనున్నారు. సాంకేతిక సిబ్బంది కెమెరాను శ్రేయాస్ కృష్ణ మరియు ఎడిటింగ్ షఫీక్ మహమ్మద్ అలీ హ్యాండిల్ చేస్తున్నారు. ప్రొడక్షన్ డిజైన్ టీమ్‌కు జాకీ నేతృత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఇంటెన్స్ మరియు మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ చిత్రాన్ని స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ మరియు 2D ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రం మే 1వ తేదీన తమిళం మరియు తెలుగులో ఒకేసారి థియేట్రికల్ విడుదల కోసం షెడ్యూల్ చేయబడింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa