ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఒక సినిమాలో నటిస్తున్నారంటూ గతంలో పుకార్లు షికారు చేశాయి. అయితే ఇప్పుడు అది నిజం అవుతోంది. డేవిడ్ వార్నర్ త్వరలో వెండి తెరపై సందడి చేయనున్నారు. నిర్మాత రవిశంకర్ ఈ విషయాన్ని వెల్లడించారు. నితిన్ హీరోగా రూపొందుతున్న ‘రాబిన్‌హుడ్’ తెలుగు మూవీలో డేవిడ్ అతిధి పాత్ర పోషిస్తున్నారు.హైదరాబాద్‌లో జరిగిన కింగ్ స్టన్ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో ఆయన ఈ విషయాన్ని తెలియజేశారు. దీంతో సోషల్ మీడియా వేదికగా డేవిడ్ వార్నర్ అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa