చాలా గ్యాప్ తర్వాత ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటిస్తోన్న బాలీవుడ్ చిత్రం `ది స్కై ఈజ్ పింక్`. పర్హాన్ అక్తర్, జైరా వసీమ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అక్టోబర్ 11న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. సెప్టెంబర్ 5 నుండి 15 వరకు టోరంటోలో జరిగే అంతర్జాతీయ ఫిలిమ్ ఫెస్టివల్‌లో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయమేమంటే.. ఈ ఫిలిమ్ ఫెస్టివల్‌కు ఎంపిక ఏకైక ఏషియన్ సినిమా ఇదే. ప్రాణాంతకమైన వ్యాధిబారిన పడ్డ కుమార్తెకు, తల్లిదండ్రులకు మధ్య జరిగే యథార్థగాథ ఆధారంగా ఈ సినిమాను షోనాలి బోస్ తెరకెక్కిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa