`ఇరువర్` (ఇద్దరు) అనే తమిళ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది ఐశ్వర్యారాయ్. మణిరత్నం ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. తర్వాత శంకర్ దర్శకత్వంలో `జీన్స్` చిత్రంలో నటించారు. అప్పుడప్పుడు తమిళ చిత్రాల్లో నటించారు. 2010లో నటిగా తనకు బ్రేక్ ఇచ్చిన మణిరత్నం దర్శకత్వంలో `విలన్`, తొలి హిట్ ఇచ్చిన డైరెక్టర్ శంకర్‌తో `రోబో` చిత్రాల్లో నటించారు. దాదాపు తొమ్మిదేళ్లకు మరోసారి ఐశ్వర్యారాయ్ మణిరత్నం దర్శకత్వంలో `పొన్నియన్ సెల్వన్` చిత్రంలో నటించబోతున్నారు. చాలా కాలం తర్వాత చెన్నై వచ్చిన ఐశ్వర్య అక్కడి మీడియాతో ముచ్చటించారు. తమిళ సంస్కృతి, అలవాట్లు, ఆలోచనలు, వాతావరణాన్ని తాను జీవితాంతం గుర్తుచుకుంటానని, జీవితంలో తమిళ సంస్కృతి ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నానని ఎమోషనల్ అయ్యారు ఐశ్వర్యారాయ్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa