వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్‌పై డిస్ట్రిబ్యూటర్స్‌గా, నిర్మాతలుగాఎన్నో విజయవంతమైన వాణిజ్య, కుటుంబ కథా చిత్రాలను ప్రేక్షకులకు అందించారు దిల్‌రాజు, శిరీష్, లక్ష్మణ్. సామాన్య ప్రేక్షకుడి నాడిని పట్టిన ఈ ముగ్గురు అసలు ప్రేక్షకులకు ఎలాంటి సినిమాలు కావాలనే దానిపై ఓ అవగాహన ఏర్పరుచుకుని ఒక వైపు డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉంటూనే నిర్మాణ రంగంలోనూ అడుగుపెట్టారు. కథలపై పక్కా జడ్జ్‌మెంట్, మిస్ ఫైర్ కానీ ప్లానింగ్, పర్‌ఫెక్ట్ ఎగ్జిక్యూషన్‌తో నిర్మాణ రంగంలోనూ తిరుగులేని విజయాలను సొంతం చేసుకున్నారు. వీరి బ్యానర్‌లో ఓ సినిమా వస్తుందంటే ప్రేక్షకుడు మంచి సినిమా చూస్తామని థియేటర్‌లోకి అడుగుపెట్టేంత నమ్మకాన్ని సంపాదించుకున్నారు. వీరు డిస్ట్రిబ్యూటర్స్‌గా, నిర్మాతలుగా సినీ జర్నీని ప్రారంభించి నేటి 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ...హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - ``మా బ్యానర్ ప్రయాణం 1999లో `ఒకే ఒక్కడు`తో ప్రారంభమైంది. దానికి ముందు జూలై 24న `తొలిప్రేమ` చిత్రాన్ని పార్ట్‌నర్ షిప్‌లో రిలీజ్ చేశాం. పవన్‌కల్యాణ్‌గారిని స్టార్‌ను చేసిన ఆ సినిమా అనుభవం గొప్పగా అనిపించింది. అలాగే పెళ్లిపందిరి సినిమా నిర్మాతగా నేను ఇక్కడ ఉండటానికి కారణమైంది. అప్పుడు మాకు అండగా నిలిచిన నిర్మాతలకు థాంక్స్. అలాగే మా డిస్ట్రిబ్యూషన్‌లో ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన నిర్మాతలకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. డిస్ట్రిబ్యూషన్ నుండి ప్రొడక్షన్‌ను స్టార్ట్ చేశాం. తర్వాత ప్రొడక్షన్‌ను పెంచి 16 ఏళ్లలో 32 సినిమాలు పూర్తయ్యాయి. ఈ గ్రేట్ జర్నీ అని చెప్పగలను. ఈ 20 ఏళ్లలో మాకు వచ్చిన ఎక్స్‌పీరియెన్స్‌ను స్ప్రెడ్ చేయాలనే ఆలోనలో ఉన్నాం. ఒక సినిమా సక్సెస్ కావాలంటే స్క్రిప్ట్ దగ్గరి నుండి రిలీజ్ వరకు ఎన్నో అంశాలుంటాయి. 2017లో మా సంస్థలో 6 సినిమాలు చేశాం. 2018లో 3 సినిమాలు, 2019లో కూడా నాలుగు సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఇక్కడితో అగకుండా నెక్ట్స్ లెవల్‌కు వెళ్లాలనుకుంటున్నాం. అందులో భాగంగా అప్‌కమింగ్ ప్రొడ్యూసర్స్‌కు సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. అందులో భాగంగా, ఇక నుండి అందరూ నిర్మాతలు వారు తీసే సినిమాల్లో స్క్రిప్ట్ దగ్గర నుండి రిలీజ్ వరకు మా బ్యానర్‌తో అసోసియేట్ అయ్యుంటారు. మా సంస్థలో వస్తున్న మంచి సినిమాల్లాగానే వారు కూడా మంచి సినిమాలు తీయడానికి మా వంతు కృషిగా సపోర్ట్ చేయబోతున్నాం. వీళ్లే కాకుండా మంచి స్క్రిప్ట్‌తో వచ్చే నిర్మాతలకు ఆహ్వానమే. ఇది కొత్త ప్రయాణం. ప్రేక్షకులకు మంచి సినిమాలు ఇవ్వడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం`` అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa