నటుడు పోసాని కృష్ణ మురళి ఈ నెల 5న హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని ఆ క్వాష్ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. విశాఖ వన్‌టౌన్ పీఎస్ లో నమోదైన కేసుపై స్టే విధిస్తూ తీర్పునిచ్చింది. అదేవిధంగా పాలకొండ, పాడేరు, విశాఖ , పట్టాభిపురం పీఎస్ లో నమోదైన కేసులలో 35 (3) ప్రకారం నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa