బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది రష్మీ గౌతమ్. కామెడీ, రియాల్టీ షోలతో యాంకర్ గా ఫేమస్ అయ్యింది. ముఖ్యంగా జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది.అలాగే సుధీర్, రష్మీ రీల్ జోడికి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఓవైపు షోలకు యాంకరింగ్ చేస్తూనే..మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది రష్మీ. తాజాగా రాజమండ్రి గోదావరి నదిలో అస్తికలు కలుపుతున్న వీడియోను షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. నన్ను క్షమించు.. జీవితాంతం నిన్ను మిస్ అవుతూనే ఉంటాను అంటూ రాసుకొచ్చింది. ఇంతకీ రష్మీ కలిపిన అస్తికలు ఎవరివో తెలుసా.. తన పెంపుడు కుక్క చుట్కీవి. సాధారణంగా సొంతవాళ్లు చనిపోతే వారి అస్థికలను కుటుంబసబ్యులు, పుణ్య నదులు, సముద్రాల్లో కలుపుతూ ఉంటారు. కానీ యాంకర్ రష్మీ తన పెంపుడు కుక్క చుట్కీ అస్థికలను రాజమండ్రి దగ్గరున్న నదిలో కలిపింది.
కొన్నాళ్లుగా తాను ఎంతగానో ప్రేమించిన తన పెంపుడు కుక్కకు కన్నీటి వీడ్కోలు పలికింది. కొన్ని రోజుల క్రితం తన పెంపుడు కుక్క చుట్కీ చనిపోయిందని చెబుతూ రష్మీ ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా చుట్కీ అస్థికలను తీసుకువచ్చి రాజమండ్రి నదిలో కలిపింది. 'నిన్ను ప్రేమించే అవకాశం కోసం జీవితాంతం నిన్ను మిస్ అవుతూనే ఉంటాను. మరో జన్మంటూ ఉంటే నువ్వు బాధ లేకుండా పుడతావని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. నన్ను క్షమించు.. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఫ్రీగా వెళ్లు చుట్కీ గౌతమ్' అంటూ భావోద్వేగానికి గురైంది.ప్రస్తుతం రష్మీ షేర్ చేసిన వీడియో నెట్టింట వైరలవుతుంది. నిజానికి రష్మీకి జంతువులు అంటే ఎంతో ప్రేమ అని తెలిసిందే. నిత్యం పెంపుడు కుక్కలు, జంతువుల గురించి అనేక పోస్టులు పెడుతుంది. అలాగే రోడ్డుపై ఉండే అనాథ కుక్కలకు ఫుడ్ పెడుతుంది. ఇప్పుడు తన పెంపుడు కుక్క చనిపోవడంతో ఎమోషనల్ పోస్ట్ చేసింది.
![]() |
![]() |