ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కంగన, మాధవన్‌ కలయికలో రానున్న చిత్రం

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 11, 2025, 11:10 AM

కంగనా రనౌత్‌, మాధవన్‌ జంటగా మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. వారిద్దరూ ప్రధాన పాత్ర ధారులుగా ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం షూటింగ్‌ పూర్తయింది. ఈ విషయాన్ని కంగన సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. చిత్రబృందంతో సెట్‌లో దిగిన ఫొటోలను షేర్‌ చేశారు. త్వరలోనే టైటిల్‌ను ప్రకటించి, సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని తెలిపారు. సైకలాజికల్‌ థ్రిల్లర్‌ జానర్‌లో పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రం తెరకెక్కింది. ‘తను వెడ్స్‌ మను రిటర్న్స్‌’ చిత్రం తర్వాత కంగన, మాధవన్‌ కలసి నటించిన చిత్రమిది. అలాగే ‘తలైవి’ చిత్రం తర్వాత మరోసారి ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వంలో కంగన నటించారు. తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa