నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో 'రాబిన్ హుడ్' సినిమా రూపొందింది. మైత్రీమూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 28వ తేదీన విడుదల కానుంది. శ్రీలీల కథానాయికగా నటించిన ఈ సినిమా, డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఆడియన్స్ ను పలకరించనుంది. రీసెంటుగా ఈ సినిమా నుంచి 'అది దా సర్ ప్రైజ్' అనే సాంగ్ ను వదిలారు. ఇది సినిమాలో కీలకమైన సమయంలో వచ్చే స్పెషల్ సాంగ్. ఈ పాటకి శేఖర్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీని అందించాడు. ఈ తరహా పాటలు మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకునే కంపోజ్ చేస్తూ ఉంటారు. అందువలన అటు సాహిత్యం... ఇటు మూమెంట్స్ కాస్త హాట్ హాట్ గానే అనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ పాట విషయంలో కేతిక వేసిన ఒక 'హుక్ స్టెప్' మరీ అభ్యంతరకరంగా ఉందనే టాక్ సోషల్ మీడియాలో నడుస్తోంది. ఇప్పటికే ఈ సాంగ్ యు ట్యూబ్ లో 3మిలియన్లకు పైగా వ్యూస్ ని సాధించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa