ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'RC16' లో ప్రముఖ కన్నడ నటి కీలక పాత్ర

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 18, 2025, 05:38 PM

ప్రముఖ దర్శకుడు బుచ్చి బాబు సనా దర్శకత్వం వహించిన రామ్ చరణ్ రాబోయే ప్రాజెక్ట్ RC16 సినీ ప్రేమికులలో ఎంతో ఆసక్తిని కనబరుస్తోంది.  ఈ చిత్రంలో బాలీవుడ్ దివా జాన్వి కపూర్ మహిళా ప్రధాన పాత్రలో నటించగా, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివైందూ శర్మ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమాలో కన్నడ నటి మేఘన రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా సెట్స్ లో నటి జాయిన్ అయ్యినట్లై ఫిలిం సర్కిల్ లో లేటెస్ట్ టాక్. ఈ చిత్రానికి మేకర్స్ పెద్ది అనే టైటిల్ ని లాక్ చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంగీతాన్ని అర్.రాహ్మాన్ ట్యూన్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో, RC 16 ప్రధాన పాన్-ఇండియన్ విడుదల కానుంది.సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి వెంకట సతీష్ కిలారు తన వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ఆర్‌సి 16 చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ రత్నావెలూ ISC ఈ ప్రాజెక్ట్ కోసం విజువల్స్ ను నిర్వహిన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa