‘గీతాంజలి’ (1989) సమయంలో జరిగిన ఓ సంఘటనను కింగ్ నాగార్జున తాజా ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. 'గీతాంజలి' చిత్రం క్లైమాక్స్‌లో హీరో నాగార్జున తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న హీరోయిన్ గిరిజా షెట్టార్‌ను ముద్దుపెట్టుకుంటారు. ఈ సీన్ సినిమా మొత్తానికే హైలైట్ అయ్యింది. అయితే ఈ సన్నివేశాన్ని సెన్సార్ బోర్డు కత్తిరిస్తుందేమోనని నాగార్జున కంగారు పడ్డారట. ఆయన ‘సెన్సార్ బోర్డు సంప్రదాయంగా ఉండే సీన్లను మాత్రమే అనుమతిస్తుందేమోనని అప్పుడు అనుకునేవాడ్ని. అందుకే ‘గీతాంజలి’లో ముఖ్యమైన ముద్దుసీన్ను కట్ చేస్తారేమోనని కంగారుపడ్డా. అందుకే సినిమా స్క్రీనింగ్‌కు ముందు ఈ సీన్ గురించి నాన్నతో చెప్పా. ‘సినిమాలో ముద్దు సన్నివేశం ఉంటుంది. భావోద్వేగంతో కూడింది. సెన్సార్ సభ్యులు కట్ చేస్తారేమో..’ అని చెప్పా. షో పూర్తయిన తర్వాత నాన్న మాట్లాడుతూ.. ‘‘గీతాంజలి’ సినిమాలోని అతి ఉత్తమమైన సన్నివేశం అది. సెన్సార్ బోర్డు సభ్యుడు/సభ్యురాలు జీవితంలో ఎవర్నైనా ప్రేమించి ఉంటే కచ్చితంగా ఈ సన్నివేశాన్ని కత్తిరించరు’ అని నాకు హామీ ఇచ్చారు’ అని కింగ్ పేర్కొన్నారు. అప్పట్లో ఈ ప్రేమకథా చిత్రం ప్రేక్షకుల హృదయాల్ని తాకింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa