ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శరవేగంగా నితిన్ "రంగ్ దే"

cinema |  Suryaa Desk  | Published : Wed, Jul 31, 2019, 12:00 PM

నితిన్, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "రంగ్ దే". అయితే ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ చాలా వేగంగా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. నితిన్ .. కీర్తి సురేశ్ ఇద్దరూ కూడా పోటీపడి నటిస్తున్నారనీ, వాళ్లిద్దరి నటన గుర్తుండిపోయేలా ఉంటుందంటూ వెంకీ ఒక ట్వీట్ చేశాడు. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా తమ జీవితాలను రంగులమాయం చేయనుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశాడు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తోన్న ఈ సినిమాకి, పీసీ శ్రీరామ్ ఈ సినిమాకి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఆయన బాణీలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని అంటున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa