అక్కినేని నాగ చైతన్య ఒకవైపు సినిమాలు చేస్తూనే పలు వ్యాపారాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తన అర్ధాంగి శోభితతో కలిసి మరో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించారు.'షుజి' పేరుతో తమ నూతన ఫుడ్ బిజినెస్ మొదలు పెట్టినట్లు నాగ చైతన్య, శోభితలు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రుచులన్నింటినీ ఒకేచోట అందించే లక్ష్యంతో 'షుజి'ని పరిచయం చేస్తున్నట్లు చైతన్య తెలిపారు. తమ ప్రయత్నానికి అభిమానుల ఆదరణ, ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉండాలని ఆయన కోరారు. అంతేకాకుండా, కిచెన్ మరియు అక్కడ తయారవుతున్న వివిధ రకాల వంటకాల ఫోటోలను కూడా చైతన్య పంచుకున్నారు.ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినీ ప్రముఖులు, అక్కినేని అభిమానులు చైతూ, శోభితలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కొందరు నెటిజన్లు వివాహమైన కొద్ది నెలలకే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి వ్యాపారం ప్రారంభించడాన్ని అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు.
![]() |
![]() |