యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా పూర్తి యాక్షన్ ఎంటర్టయినర్ గా తెరకెక్కుతున్న చిత్రం 'సాహో'. ఈ సినిమా ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇప్పటికే 'సైకో సయాన్' పేరుతో ఇప్పటికే ఓ సాంగ్ రిలీజ్ చేసిన ఈ చిత్రబృందం తాజాగా 'ఏ చోట నువ్వున్నా' అంటూ సాగే ఓ ప్రేమ గీతాన్ని విడుదల చేసింది. ఇది ఈ సంవత్సరపు ప్రేమగీతం అవుతుందని, మీ హృదయాలను గిలిగింతలు పెడుతుందని యూవీ క్రియేషన్స్ తన ట్విట్టర్ అకౌంట్ లో పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa