సంక్రాంతి కానుకగా ప్రేక్షకులను నవ్వించేందుకు "సరిలేరు నీకెవ్వరూ" అనే నవ్వుల ట్రైన్లో మహేష్ బాబు వస్తున్నారంటూ దర్శకుడు అనీల్ రావిపూడి.`హిలేరియస్ ట్రైన్ కామెడీని థియేటర్స్‌లో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? మా ట్రైన్ సంక్రాంతికి సిద్ధం అవుతోంది. మా సినిమా కోసం సిద్ధంగా ఉండండి.. సూపర్‌స్టార్ మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తారు` అని అంటూ అనీల్ ట్విట్టర్లో పోస్టు చేశారు. ఈయన దర్శకత్వంలో మహేశ్ హీరోగా రూపొందుతోన్న చిత్రం `సరిలేరు నీకెవ్వరు`. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతుంది. ట్రైన్ ఎపిసోడ్ చిత్రీకరణ కోసం హైదరాబాద్ అన్నపూర్ణలో ఓ భారీ ట్రైన్ సెట్‌ను ఏర్పాటు చేశారు. అందులోనే చిత్రీకరణ జరుగుతోంది. దిల్‌రాజు, అనీల్ రావిపూడి, మహేశ్ ఈ సినిమా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను సంక్రాంతికి విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa