భోళా శంకర్: టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 2015లో అజిత్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ హిట్ వేదాళం చిత్రానికి రీమేక్. ఈ చిత్రంలో తమన్నా చిరుకి జోడిగా నటించింది. ఈ సినిమా యొక్క శాటిలైట్ రైట్స్ ని జీ తెలుగు ఛానల్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా మే 11న ఉదయం 9:00 గంటలకి వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ గా ప్రసారం కానున్నట్లు సమాచారం. కీర్తి సురేష్, సుశాంత్, వేణు యెల్దండి, హైపర్ ఆది, శ్రీముఖి, తరుణ్ అరోరా, మురళీ శర్మ, బిత్తిరి సతి, రవిశంకర్, రఘుబాబు, గెట్ అప్ శ్రీను, రష్మీ గౌతమ్, వెన్నెల కిషోర్, తులసి, మరియు ఉత్తేజ్ ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు. కోల్‌కతా నేపథ్యంలో జరిగిన భోలా శంకర్ ని ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మించారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి డూడ్లీ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
ఆయ్: అంజి దర్శకత్వంలో నార్నే నితిన్ నటించిన 'ఆయ్' సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించింది. ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ శాటిలైట్ రైట్స్ ని జీ తెలుగు మరియు జీ సినిమాలు ఛానల్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా జీ తెలుగు ఛానల్ లో మే 11న సాయంత్రం 3:30 గంటలకి స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్లు ఛానల్ ప్రకటించింది. ఈ సినిమాలో నయన్ సారిక మహిళా ప్రధాన పాత్రలలో నటించారు. ఈ చిత్రంలో అంకిత్ కొయ్య, రాజకుమార్ కసిరెడ్డి, వినోద్ కుమార్, మైమ్ గోపి మరియు ఇతరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బన్నీ వాస్ మరియు విద్యా కొప్పినీడి అల్లు అరవింద్ యొక్క గీతా ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి రామ్ మిరియాల మరియు అజయ్ అరసాద సంగీతం అందించారు.
రాబిన్హుడ్: వెంకీ కుడుములా దర్శకత్వంలో టాలీవుడ్ నటుడు నితిన్ ప్రధాన పాత్రలో నటించిన 'రాబిన్హుడ్' చిత్రం మార్చి 28, 2025న విడుదల అయ్యింది. ఈ చిత్రంలో నితిన్ కి జోడిగా శ్రీలీల నటిస్తుంది.ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ శాటిలైట్ రైట్స్ ని జీ తెలుగు మరియు జీ సినిమాలు ఛానల్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా జీ సినిమాలు ఛానల్ లో మే 10న సాయంత్రం 6 గంటలకి స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్లు ఛానల్ ప్రకటించింది. దేవదత్త నాగే ఈ చిత్రంలో పవర్ఫుల్ విలన్ గా నటించారు. మైథ్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్ర సంగీతాన్ని జివి ప్రకాష్ కుమార్ స్వరపరిచారు. రాజేంద్ర ప్రసాద్, వెన్నెలా కిషోర్, గోపి, లాల్, శుభలేఖ సుధాకర్, సుదర్శన్ మరియు ఇతర ప్రతిభావంతులైన నటులతో పాటు ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కీలక పాత్రలో నటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa