ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సండే ప్రైమ్ టైమ్ సినిమాలు

cinema |  Suryaa Desk  | Published : Sat, May 10, 2025, 08:39 AM

సరిలేరు నీకెవ్వరూ: అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరూ' చిత్రం సాలిడ్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో మహేష్ బాబుకి జోడిగా రష్మిక మందాన నటించింది. ఈ చిత్రం యొక్క శాటిలైట్ రైట్స్ ని జెమినీ టీవీ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా జెమినీ టీవీ ఛానల్ లో మే 11న సాయంత్రం 6 గంటలకి స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్లు ఛానల్ ప్రకటించింది. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ విలన్ గా నటించగా, విజయ శాంతి, సత్య దేవ్, సంగీత, హరి తేజ, రావు రమేష్, అప్పారావు, సుబ్బరాజు మరియు రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ మరియు AK ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు.


హనుమాన్: ప్రశాంత్ వర్మ యొక్క సూపర్ హీరో యాక్షన్ చిత్రం "హనుమాన్" 2024లో అతిపెద్ద హిట్‌లలో ఒకటిగా నిలిచింది. తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ 250 కోట్ల గ్రాస్‌ను అధిగమించింది. ఈ సినిమా ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ జీ తెలుగు ఛానల్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌ను మే 11న సాయంత్రం 6 గంటలకి ప్రదర్శించటానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో తేజ సజ్జ ప్రేమికురాలిగా అమృత అయ్యర్ నటించగా, అతని సోదరిగా వరలక్ష్మి శరత్‌కుమార్ నటించింది. వినయ్ రాయ్ విలన్ గా నటించిన ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను, సత్య, రాజ్ దీపక్ శెట్టి కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి ఈ విఎఫ్‌ఎక్స్ భారీ చిత్రాన్ని నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa