ఆదిపురుష్: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' సినిమా బాక్స్ఆఫీస్ వద్ద డిసాస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందించబడింది. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ పౌరాణిక నాటకం మే 11, 2025 ఉదయం 08:00 గంటలకు స్టార్ మా ఛానల్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌ని షెడ్యూల్ చేయబడింది. ఈ చిత్రంలో కృతి సనన్ సీతా దేవి పాత్రను పోషించింది. ఈ పాన్-ఇండియన్ ప్రొడక్షన్‌లో సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటించారు. ఈ చిత్రంలో దేవదత్తా నాగే, వత్సల్ షేత్, సోనాల్ చౌహాన్, తృప్తి తోరద్మల్ మరియు ఇతరులు కూడా ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు. T-సిరీస్ మరియు రెట్రోఫిల్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రానికి అజయ్-అతుల్ సంగీతాన్ని అందించారు.
స్వాగ్: హసిత్ గోలి దర్శకత్వం వహించిన శ్రీవిష్ణు నటించిన 'స్వాగ్' స్టార్ మా ఛానల్ లో మే 11న మధ్యాహ్నం 1 గంటకి వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ ని ప్రదర్శించనున్నట్లు ఛానల్ ప్రకటించింది. ఈ సినిమాలో రీతూ వర్మ కథానాయికగా నటించింది. ఈ సినిమాలో మీరా జాస్మిన్, శరణ్య, దక్ష నాగర్కర్, శ్రీను, గోపరాజు రమణ, సునీల్, రవి బాబు కీలక పాత్రలలో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa