పవన్ ప్రభ దర్శకత్వంలో రుపీష్ కథానాయకుడిగా ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించారు. ఈ చిత్రానికి మేకర్స్ 'షష్ఠి పూర్తి' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రం వివిధ ప్రదేశాలలో ప్రధానంగా రాజమండ్రీ సమీపంలో, గోదావరి ప్రాంతం యొక్క సహజ సౌందర్యాన్ని సంగ్రహిస్తుంది. ఈ సినిమాలోని ఇప్పటివరకు విడుదలైన సాంగ్స్ కి భారీ స్పందన లభించింది. తాజాగా ఇప్పుడు చిత్ర బృందం ఈ సినిమాలోని వేయి వేణువులు సాంగ్ ని మే 18న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇళయరాజా కంపోస్ చేసిన ఈ సాంగ్ కి చైతన్య ప్రసాద్ లిరిక్స్ అందించగా, కార్తీక్ తన గాత్రాణి అందించారు. ఈ సినిమాని మే 30న విడుదల కానుంది. ఐకానిక్ 'లేడీస్ టైలర్' చలన చిత్ర జంట రాజేంద్ర ప్రసాద్ మరియు అర్చన ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మా AAIE ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఇళయరాజా ఈ సినిమాకి మ్యూజిక్ ని అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa