తెలుగు సినీ స్టిల్ ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 181వ వరల్డ్ ఫొటోగ్రఫీ డే ఉత్సవాలు హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడ నాగార్జున నగర్‌లోని నాగార్జున నగర్ వెల్ఫేర్ అసోసియేషన్‌లో సోమవారం వైభవంగా జరిగాయి. తెలుగు సినిమా స్టిల్ ఫొటోగ్రాఫర్ల అధ్యక్షుడు కఠారి శ్రీను , జనరల్ సెక్రటరీ జి. శ్రీను, వైస్ ప్రెసిడెంట్ సుబ్బారావు .యస్, ట్రెజరర్ వీరభద్రమ్ తదితరుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్, `అల్లరి` నరేష్, వైవీయస్ చౌదరి, రసూల్ ఎల్లోర్ తదితరులు హాజరయ్యారు. ఇదే వేదిక మీద సీనియర్ ఫొటోగ్రాఫర్లు శ్యామల్ రావు, శ్యామ్‌ను సత్కరించారు. సినీ స్టిల్ ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులందరూ ఈ వేడుకలో పాల్గొన్నారు.
నట కిరీటి డా. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ “మూడు తరాల స్టిల్ ఫొటోగ్రాఫర్లతో నాకు అనుబంధం ఉంది. వాళ్లు నాకు ఫ్యామిలీలాంటివాళ్లు. ఒకప్పుడు ఫొటోలతోనే నా పబ్లిసిటీ నడిచింది. వరల్డ్ ఫొటోగ్రపీడే సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం, దానికి నన్ను ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉంది. బి.ఎన్.రెడ్డిగారు, ఎన్టీఆర్‌గారు… ఇలా ఎంతో మంది లెజెండ్స్ తో నాకు పరిచయం ఉంది. వారందరితో నాకున్న ఫొటోలు చూసుకుని ఆనాటి విషయాలను గుర్తుచేసుకుని ఆనందిస్తుంటాను. ఇప్పుడే కాదు, స్టిల్ ఫొటోగ్రాఫర్ల అసోసియేషన్ తరఫున వాళ్లు ఎప్పుడు పిలిచినా, నేను రావడానికి సిద్ధంగా ఉంటాను. ఈ కార్యక్రమం విజయవంతం కావాలి“ అని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa