ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు థియేటర్స్ లో సందడి చేయనున్న 'అందాల రాక్షసి'

cinema |  Suryaa Desk  | Published : Thu, Jun 12, 2025, 03:26 PM

నవీన్ చంద్ర, లావణ్య త్రిపాఠి మరియు రాహుల్ రవీంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన 'అందాల రాక్షసి' జూన్ 13న అంటే రేపు రీ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. హను రాఘవపుడి దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ డ్రామా ఈ ఏడాది విడుదలైన 13 సంవత్సరాలు పూర్తి కానుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు రీ రిలీజ్ ని ప్లాన్ చేసారు. ఈ సినిమాకి మరియు సాంగ్ స్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రాధన్ సంగీతాన్ని కంపోజ్ చేయగా, మురళి జి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఈ సినిమాలో నరసింహ రావు, ప్రగతి, మురళి కృష్ణ మరియు ఇతరులు కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమాని సాయి కొర్రాపతి, ఎస్ఎస్ రాజమౌలి కలిసి నిర్మించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa