ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రేమకుడి నిర్మాణంలో నయన్ చిత్రం

cinema |  Suryaa Desk  | Published : Mon, Aug 26, 2019, 02:51 PM

అగ్ర సినీ నటి నయనతార తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. గతంలో నయన్ 'నేనూ రౌడీనే' అనే చిత్రాన్ని శివన్ దర్శకత్వంలో చేసింది. వీరిద్దరి కాంబినేషన్ లో తాజాగా మరో చిత్రం తెరకెక్కబోతోంది. హీరోయిన్ గా నయనతార నటించనున్న ఈ చిత్రానికి శివన్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. 'అవళ్' ఫేమ్ మిళింద్ రావు ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. వచ్చే నెలలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళుతుందని కోలీవుడ్ టాక్. ప్రస్తుతం ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎంపిక జరుగుతోందట. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa