ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాకు జ్వరమొచ్చింది అంతే : నాగార్జున

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 28, 2019, 04:32 PM

కొన్ని  రోజుల నుండి నాగార్జున ఆరోగ్యం కుదురుగాలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలు తార స్థాయికి చేరనివ్వకుండా ఉండేందుకు కింగ్ నాగార్జునే స్వయంగా రంగంలోకి దిగారు. ఇటీవల 'మన్మథుడు 2' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో యంగ్ లుక్ తో కనిపించడం కోసం నాగార్జున గట్టి కసరత్తులు చేశారు. ఈ వయసులో ఆయన ఎక్కువగా కసరత్తులు చేయడం వలన, తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నారనే టాక్ ఫిల్మ్ నగర్లో షికారు చేసింది. కీళ్ల నొప్పులతో చాలా బాధపడుతున్నారనే వార్త కూడా కొన్ని వెబ్ సైట్స్ లో జోరందుకుంది. ఈ ప్రచారం అంతకంతకూ పుంజుకుంటూ ఉండటంతో తనకి జ్వరం తప్ప ఎలాంటి అనారోగ్య సమస్య లేదంటూ స్పష్టం చేయవలసి వచ్చింది. నాగార్జున తనకి జ్వరం తప్ప మరెలాంటి ఆరోగ్య సమస్య లేదనీ, ఆందోళన చెందవలసిన అవసరం లేదని తన సన్నిహితులతో ఫ్యాన్ గ్రూపులో షేర్ చేయించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa