ఆర్‌డీఎక్స్ లవ్ అనే చిత్రం చేస్తుంది నటి పాయల్ రాజ్ పుత్. ఈ చిత్ర టీజర్ తాజాగా విడుదలైంది. ఇందులో డబుల్ మీనింగ్ డైలాగ్స్, హాట్ రొమాన్స్ యూత్‌ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం కూడా యూత్‌కి మంచి కిక్ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని టీజర్ చూస్తే తెలుస్తుంది. ఈ చిత్రానికి శంకర్ భాను దర్శకుడు. రధన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సీకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హ్యాపీ మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం నాయిక ప్రాధాన్యత ఉన్న చిత్రంగా ఉంటుందని సమాచారం. తేజు కంచర్ల మరో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.సెప్టెంబర్‌లో చిత్ర విడుదలకి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa