తెలుగు బుల్లితెరపై సూపర్ డూపర్ గా ప్రేక్షకులను నవ్విస్తున్న కామిడి షో ఏది అంటే వెంటనే "జబర్దస్త్" షో అని చెప్పేస్తారు. అయితే ఈ షో చేసే ఆర్టిస్టులకు ఎంత పారితోషికాలు ఇస్తున్నారు అని తెలుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా కార్యక్రమంలో కనిపించేవారికి అందే పారితోషికాల వివరాలను తెలిపే లిస్టు ఒకటి బయటికి వచ్చింది. ఈ షోకి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తోన్న నాగబాబుకి నెలకి 20 లక్షలు .. రోజాకి 15 లక్షలు పారితోషికంగా ముడుతున్నాయట. ఇక యాంకర్స్ గా అనసూయ నెలకి 4 లక్షలు తీసుకుంటుంటే, రష్మీ నెలకి 3 లక్షలు అందుకుంటుందని అంటున్నారు. స్కిట్లు చేసేవారిలో సుడిగాలి సుధీర్ .. చమ్మక్ చంద్రకి నెలకి 4 లక్షలు, హైపర్ ఆది - గెటప్ శీను నెలకి 3 లక్షలు పారితోషికంగా అందుకుంటున్నారట. మిగతా వాళ్ల పారితోషికాలు వాళ్ల స్థాయికి తగినట్టుగానే ఉంటాయట. తక్కువ పారితోషికం అంటే నెలకి డెబ్భై అయిదు వేలు" అని చెప్పుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa