విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో తెరకెక్కిన టాక్సీవాలా చిత్రంతో తెలుగు తెరకి పరిచయమైన అందాల భామ ప్రియాంక జవాల్కర్.సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.అవకాశం కోసం దాదాపు ఆమె ఏడాది నుండి వెయిట్ చేస్తోంది .ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కూడా ఉంది. అండంతోపాటు. ఆ అందాన్ని వెండితెరపై ఆరబోయగల ధైర్యం కూడా ఉంది. ఇన్ని ఉన్నప్పటికీ.. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న రీతిన, ఎందుకనో పాపం ట్యాక్సీవాలా ఫేమ్ ప్రియాంక జవాల్కర్ కు తెలుగులో అవకాశాలు మాత్రం రావడం లేదు. ప్రస్తుతం ఓ లేడీ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న చిత్రంలో శివరాజ్ కందుకూరి సరసన కథానాయికగా నటిస్తున్న ప్రియాంక జవాల్కర్ కు తెలుగులో మరో అవకాశం రాలేదు.
తెలుగమ్మాయి కావడం వలనే ప్రియాంకకు పెద్దగా ఆఫర్లు రావడం లేదని అభిప్రాయపడుతున్నారు కొందరు. ఎందుకంటే.. కనీస స్థాయి నటన రాని నార్త్ అమ్మాయిలను ముంబై నుంచి ఇంపోర్ట్ చేసుకోవడానికి అలవాటుపడిపోయిన మన తెలుగు దర్శకనిర్మాతలు.. తెలుగు అమ్మాయిలను పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు. మోహనకృష్ణ ఇంద్రగంటి లాంటి దర్శకుడు కూడా గత రెండు సినిమాలుగా బాలీవుడ్ హీరోయిన్ కు ఫిక్స్ అయిపోవడం గమనార్హం. ఇలా అయితే.. మన తెలుగమ్మాయిలు తెలుగులో అవకాశాలు అందుకోవడం చాలా కష్టం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa