జబర్దస్త్ నటుడు అదిరే అభి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసేవాడిని కానీ నటన పై ఉన్న ఆసక్తితో ఉద్యోగం వదలిపెట్టాను. నేను మొదటిసారిగా ప్రభాస్ ఈశ్వర్ సినిమాలో ఆయనకు ఫ్రెండ్‌గా నటించాను అని అభి అన్నారు. జబర్దస్త్ షో ప్రతిభ ఉన్న వారికి వారి ప్రతిభను నిరూపించుకోవడానికి మంచి ప్లాట్‌ఫామ్. అప్పారావు, శంకర్, శ్రీను, నరేష్, నాకు జబర్దస్త్ షో వల్లే మంచి నటులుగా గుర్తింపు వచ్చింది అని తెలిపారు. నటనలో చిరంజీవి అంటే ఎంతో ఇష్టం అని అన్నాడు. బాహుబలి–2కి రాజమౌళి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశానని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa