ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ సినిమా పేర్లతో పాట పడిన కీరవాణి

cinema |  Suryaa Desk  | Published : Tue, Jul 22, 2025, 02:29 PM

శిల్పాక‌ళావేదిక‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ప‌వ‌ర్ స్టార్‌ త‌న అర్ధాంగి అన్నా లెజినోవాతో క‌లిసి హాజ‌రు కావ‌డం విశేషం. ఇక,  ఈ ఈవెంట్‌లో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి పవన్ సినిమా పేర్లన్నీ కలిపి ఓ స్పెషల్ సాంగ్ తయారుచేసి ప్ర‌ద‌ర్శించ‌డం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. ఈ సాంగ్ ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులు లేకుండా చేసింది. అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి నుంచి ఇప్ప‌టి హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు వ‌రకు ప్ర‌తి సినిమాని ట‌చ్ చేస్తూ ఈ పాట‌ సాగింది. ఇప్పుడీ సాంగ్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa