ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.7,499కే లావా బోల్డ్ N2

business |  Suryaa Desk  | Published : Wed, Feb 18, 2026, 12:58 PM

దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా బడ్జెట్ ప్రియుల కోసం సరికొత్త మొబైల్ 'లావా బోల్డ్ N2'ను మంగళవారం అధికారికంగా విడుదల చేసింది. తక్కువ ధరలో ప్రీమియం లుక్, క్లీన్ సాఫ్ట్‌వేర్ అనుభవాన్ని కోరుకునే వారిని టార్గెట్‌గా చేసుకుని ఈ ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. ఈ ఫోన్ ఫిబ్రవరి 27 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ రూ.7,499కే లభ్యం కానుంది.లావా బోల్డ్ N2లో 6.75 అంగుళాల HD+ (720 x 1600 పిక్సెల్స్) LCD డిస్‌ప్లేను అందించారు. ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల స్క్రోలింగ్, యాప్ నావిగేషన్ సాఫీగా ఉంటుంది. ఈ ఫోన్ 1.6GHz ఆక్టా-కోర్ Unisoc SC9863A ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 4GB RAMతో పాటు 4GB వరకు వర్చువల్ గా పెంచుకునేందుకు సపోర్ట్ ఉంది. 64GB స్టోరేజ్‌తో వస్తున్న ఈ ఫోన్ మైక్రోSD కార్డ్ ద్వారా 512GB వరకు విస్తరించుకునే అవకాశం కల్పిస్తోంది. ఇది ఆండ్రాయిడ్ 15 గో ఎడిషన్ పై నడుస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa