ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ నన్నుఎంతగానో అభినందించాడు : తనికెళ్ల భరణి

cinema |  Suryaa Desk  | Published : Wed, Sep 04, 2019, 05:40 PM

నటుడిగా, రచయితగా తనికెళ్ల భరణికి మంచి గుర్తింపు వుంది. శివుడి గురించి ఆయన అనేక పద్యాలను పాటలను రాశారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పవన్ 'బాలు' సినిమా చేస్తున్న రోజులవి. ఆ సినిమాలో నేను ఒక వేషం వేశాను. షూటింగు షాట్ గ్యాపులో ఆయన కారవాన్ లో వున్నారు. ఆయన అసిస్టెంట్ తో కబురు చేసి నేను వెళ్లి ఆయనను కలిశాను. నేను రాసిన 'నాలోన శివుడు గలడు' అనే పాటల సీడీని పవన్ కి ఇచ్చేసి వచ్చేశాను. మరుసటి రోజు నేను సెట్ కి వెళ్లగానే, పవన్ నుంచి కబురు వచ్చింది. నేను ఆయన కారవాన్ లోకి వెళ్లగానే నన్ను గట్టిగా హత్తుకున్నారు. 'శివుడి గురించి మీరు రాసిన పాటలు విన్నాను .. ఏదో తెలియని అనుభూతి కలిగింది. చాలా బాగా రాశారు" అంటూ అభినందించారు" అని తనికెళ్ల భరణి అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa