బ్రహ్మీతో ఎంతమందికో ఈ అదృష్టం అంటూ దర్శకుడు హరీష్ శంకర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం స్వయంగా తనకు భోజనం వడ్డిస్తున్న ఫొటోను హరీష్ బుధవారం ట్విటర్‌లో షేర్ చేశారు. 'ఎంత మందికో ఈ అదృష్టం.. సినిమాకు రుణపడి ఉన్నాను. 'వాల్మీకి' సినిమా చివరిరోజు షూటింగ్ ఫుల్ సర్‌ప్రైజ్‌లతో నిండిపోయింది' అని పోస్ట్ చేశారు. ఈ ఫొటో సోషల్‌మీడియాలో అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa